HomeTelugu Trendingరామ్ రెడ్ నుంచి మరో సాంగ్ రిలీజ్

రామ్ రెడ్ నుంచి మరో సాంగ్ రిలీజ్

Ram Red movie song
హీరో రామ్ పోతినేని తాజా చిత్రం రెడ్. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. క్లాస్, మాస్‌గా రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డించక్ అనే పాట లిరికల్ వీడియో విడుదలైంది. ఈ సాంగ్ తెగ వైరల్ అవుతోంది. అయితే తాజాగా రెడ్ సినిమానుంచి వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. “నువ్వే.. నువ్వే..” అంటూ సాగే ఈ సాంగ్ రిలీజ్ కాగానే వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ సరసన మాళవిక శర్మ, నివేతా పేతురాజ్, అమృతా అయ్యర్ నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu