HomeTelugu Trendingహీరో రామ్‌కు గాయాలు

హీరో రామ్‌కు గాయాలు

Pothineni got injured

టాలీవుడ్‌ హీరో రామ్‌ పోతినేని గాయాలపాలయ్యారు. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తుండగా ఆయన మెడకు గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. తనకు అయిన గాయాన్ని చూపిస్తూ ఫోటోను షేర్‌ చేశాడు. దీంతో రామ్‌ త్వరగా కోలుకోవాలి.. గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు.

ఈసినిమా తన పాత్ర కోసం రామ్‌ తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోసం జిమ్‌లో వ్యాయామం చేస్తూ గాయాలపాలయ్యాడు. రామ్‌ మెడకు స్వల్పగాయం కావడంతో సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈసినిమాలో రామ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!