‘సవ్యసాచి’ మేకింగ్ వీడియో

అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సవ్యసాచి’. చైతూ హీరోగా ప్రేమమ్‌ లాంటి సూపర్‌ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిథి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

నవంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్‌ ట్రైలర్‌లతో ఆకట్టుకున్న సవ్యసాచి టీం తాజాగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. పూర్తి యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. తన ఎడమ చేతిమీ నియంత్రణ లేని పాత్రలో చైతూ నటన ఆకట్టుకుంటుందంటున్నారు చిత్రయూనిట్‌.