46 డిగ్రీల ఎండని కూడా లెక్కచేయని ‘ఇస్మార్ట్ శంకర్‌‌’

సరైన హిట్‌లేక, తిరిగి ఫామ్‌లోకి రాలేక సతమతమవుతున్న ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌.. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌తో కలిసి ఇస్మార్ట్‌ శంకర్‌ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పటికే మేజర్‌ పార్ట్ పూర్తయిందని సమాచారం.

తెలంగాణ యాసలో తెరపై హంగామా చేసేందుకు రామ్‌ రెడీ అయ్యాడు. ఈ సినిమా కోసం బాడీని కూడా బిల్డప్‌ చేసి.. సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రయూనిట్‌ ప్రస్తుతం వారణాసిలో ఉంది. 46డిగ్రీల ఎండలో షూటింగ్‌ జరుగుతోందని చార్మీ ట్వీట్‌ చేశారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates