
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఇంటికి మరో కొత్త వారసుడు వచ్చాడు. ఈయన ఇంటికి ఓ చిన్న పిల్లాడు వచ్చాడు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే ఈ హీరో.. ఇప్పుడు ఓ సంతోషకరమైన వార్త వెల్లడించాడు. తాజాగా తన ఇంటికి వచ్చిన వారసుడితో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. వారసుడు వచ్చాడు అంటూ తన తన నెప్యూ సిద్దాంత్ పోతినేనితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. తన ఇంటికి వచ్చిన వారసుడిని చూసి పండగ చేసుకుంటున్నారు రామ్ కుటుంబ సభ్యులు. రామ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. ఎప్రిల్ 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మధ్యే విడుదలైన టీజర్ కూడా మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో తొలిసారి రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఇందులో నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Varasudu Vachaadu ❤️ ….my lil baby nephew Sidhanth Pothineni!
Love #RAPO pic.twitter.com/q2ls4smiRd
— RAm POthineni (@ramsayz) March 5, 2020













