సుకుమార్‌తో పవన్ నిర్మాత.!


పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలను పవన్ స్నేహితుడు శరత్ మరార్ నార్త్ స్టార్ ప్రొడక్షన్స్ లో నిర్మించాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దీంతో, శరత్ మరార్ సినిమాలు చేయడం పక్కన పెట్టి, ఇతర భాష చిత్రాలను డబ్బింగ్ చేసి విడుదల చేయడం మొదలు పెట్టాడు.

చాలా కాలం తరువాత మరలా ఇప్పుడు మరోసారి తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. శరత్ మరార్, సుకుమార్ నిర్మాణ సంస్థ సంయుక్తంగా శశి కాశి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమాను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఆర్య 2, 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు శశి రైటర్ గా పనిచేశాడు. శరత్ మరార్, సుకుమార్ నిర్మిస్తున్న సినిమాలో నాగ శౌర్యను హీరోగా తీసుకున్నారట. మరి వీరి కాంబినేషన్లో వచ్చే మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.