HomeTelugu Trendingనరేష్‌కు విడాకులిచ్చేందుకు సిద్ధంగా లేను : రమ్య రఘుపతి

నరేష్‌కు విడాకులిచ్చేందుకు సిద్ధంగా లేను : రమ్య రఘుపతి

Ramya raghupathi comments o
సీనియర్‌ నటుడు నరేష్‌- నటి పవిత్రలు న్యూఇయర్‌ సందర్భంగా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ క్రమంలో నరేష్‌ భార్య, రమ్య రఘుపతి వీరిద్ధరి పెళ్లి వార్తలపై స్పందించింది. తమకు ఇంకా విడాకులు మంజూరు కాలేదని, ఆ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉందని రమ్య తెలిపింది. నరేశ్‌కు విడాకులు ఇచ్చేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పింది. నరేష్‌, పవిత్రను ఎలా పెళ్లి చేసుకుంటాడో చూస్తానని వార్నింగ్‌ ఇచ్చింది.

‘నరేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆయనతో పెళ్లికి మా ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. నా కుటుంబసభ్యులందరికీ నచ్చజెప్పి వివాహం చేసుకున్నాం. అత్తమ్మ (విజయనిర్మల) నన్ను ఒక రాణిలా చూసుకునేవారు. పెళ్లి అయ్యాక.. నరేశ్‌ గురించి నాకు ఎన్నో విషయాలు తెలిశాయి. ఆయనకి వేరేవాళ్లతో సంబంధాలు ఉన్నాయని తెలిసి బాధపడ్డా. ఈ విషయాలపైనే ఆయన నాకెన్నోసార్లు క్షమాపణలు చెప్పాడు. ఆయన మారతాడని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా’ అని రమ్య రఘుపతి వెల్లడించింది.

‘ఇటీవల వాళ్లు షేర్‌ చేసిన వీడియో చూసి నాకు బాధగా అనిపించింది. సినిమా ప్రమోషన్‌ కోసం ఏమైనా చేశారా? అనే అనుమానం కూడా ఉంది. నన్ను ఇబ్బంది పెట్టడానికి వాళ్లిద్దరూ ఇలాంటి పనులు ఎన్నో చేశారు. వీళ్లు చేసే పనుల వల్ల నా పదేళ్ల కొడుకు కుంగుబాటుకు గురి అవుతున్నాడు. వాడికి మేమిద్దరం విడిపోవడం ఇష్టం లేదు. ‘నాన్నకు విడాకులు ఇవ్వొద్దు’ని ఓసారి వాడు నా నుంచి మాట తీసుకున్నాడు. మేమిద్దరం కలిసే ఉంటామని వాడికి మాటిచ్చా. ఎంతకష్టమైనా నేను పోరాటం చేస్తా. నరేశ్‌తో కలిసి ఉండటానికి ప్రయత్నిస్తా. మా విడాకుల కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. నేను అయితే విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేను’ అని రమ్య స్పష్టం చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!