భారీ చిత్రంలో నటించి సమయం వృధా.. పూజాహెగ్డే సంచలన వ్యాఖ్యలు

ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్లో ఎంటరైన పూజాహెగ్డే ఆమె తొలి చిత్రం తమిళంలో ముగమూడి అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. తెలుగులో మొదటి సినిమా బాక్సాఫీస్‌ వద్ద అనుకున్న ఫలితాలు అందుకోలేదు. ఆ తర్వాత వచ్చిన ముకుంద చిత్రం కూడా అంతగా మెప్పించలేకపోయింది. 2016లో వచ్చిన మొహెంజొదారో అనే భారీ చిత్రంలో హృతిక్‌ రోషన్‌కు జంటగా నటించే అవకాశం దక్కించుకుంది పూజాహెగ్డే. రెండేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమా విఫలమవడంతో చిత్రబృందం షాక్‌కు గురైంది.

ఈ సినిమాలో అనవసరంగా నటించానని పూజ బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఓ నటికి రెండేళ్లనేది చాలా కీలక సమయం. ఆ సమయంలో నేను ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. భారీ బడ్జెట్‌ చిత్రం, హృతిక్‌ హీరో, రెహమాన్‌ సంగీతం అని రెండేళ్ల కాల్‌షీట్స్‌ ఇచ్చేశా. కానీ సినిమా ఫ్లాప్‌ అవడంతో చాలా బాధపడ్డాను. దాంతో జాగ్రత్తగా కథలను ఎంపికచేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అనవసరంగా రెండేళ్లు వృథా చేశాననిపించింది. కంటెంట్‌లేని సినిమాలు వెంటవెంటనే చేసేసి పాపులర్‌ అయిపోవాలన్న తొందరపాటు నాకొద్దు అంటోంది. ప్రస్తుతం పూజా రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. మహేశ్‌బాబుకు జోడీగా మహర్షి చిత్రంలోను, ప్రభాస్‌కు జోడీగా రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రాలతో పూజా బిజీగా ఉంది.