సూర్య సినిమాలో శివగామి!

సూర్య హీరోగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ‘తానా సెరిందా కూట్టం’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన జంటగా కీర్తి సురేష్ కనిపించబోతోంది. సుమారుగా 80 కోట్ల బడ్జెట్ తో నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. 
 
అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. బాహుబలి చిత్రంలో శివగామి పాత్రతో రమ్యకృష్ణ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దీని తరువాత వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం బాహుబలి2, కమల్ హాసన్ సినిమా ‘శబాష్ నాయుడు’ చిత్రాల్లో ఆమె నటిస్తోంది. అలానే సూర్య సినిమాలో నటించడానికి కూడా ఒప్పుకుంది.