శ్రీనువైట్లకు అవకాశం దొరికినట్లే!

ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు డైరెక్ట్ చేసిన శ్రీనువైట్లకు కొంతకాలంగా సరైన హిట్ పడడం లేదు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలు ఆయన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఏ హీరో కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. కొద్దిరోజులుగా ఆయన రవితేజతో సినిమా చేసే అవకాశం ఉందంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలు నిజమే అని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికార ప్రకటన వెలువడనుంది. శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్ లో వెంకీ, దుబాయి శీను వంటి హిట్ సినిమాలు వచ్చాయి. దుబాయి శీను తరువాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయలేదు. 
మళ్ళీ ఇన్నేళ్లకు వైట్ల.. రవితేజతో సినిమా చేయాలని ఆయను సంప్రదించాడు. మిస్టర్ సినిమా డిజాస్టర్ తరువాత లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే తక్కువ పారితోషికానికి మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు శ్రీనువైట్ల. సో.. ఇప్పుడు రవితేజతో సినిమా ఇదే బ్యానర్ లో రూపొందనుందని తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ సినిమాలు చేస్తున్నాడు. వీటిలో రాజా ది గ్రేట్ సినిమా విడుదలైన వెంటనే శ్రీనువైట్లతో సినిమా విషయంలో ఓ స్పష్టత రానుంది.