HomeTelugu Trendingహల్దీ వేడుకలో మెరిసిపోతున్న మిహీకా

హల్దీ వేడుకలో మెరిసిపోతున్న మిహీకా

Ranas fiance miheeka shineటాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. ఆగస్టు 8న వీరి వివాహం.. ఈ తరుణంలో సందడి మొదలైంది.. పెళ్లి పనుల హడావిడి ఇరు కుటుంబాల్లోనూ ప్రారంభమైంది. పెళ్లికూతురు మిహికా బజాజ్ హల్దీ వేడుకలో మెరిసిపోయింది. వివాహానికి ముందు జరిగే ఈ వేడుకలో మిహికా పసుపు-ఆకుపచ్చ లెహంగాలో ఆకర్షణీయంగా నిలిచారు. ప్రత్యేక సీషెల్స్ డిజైనర్ ఆభరణాలతో ఆకట్టుకుంటున్నారు.

కాగా రామానాయుడు స్టూడియోలో వివాహం జరగనుంది. రానా, మిహికా కుటుంబాల నుండి కొద్ది మంది అతిథులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారు. అతిధులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు, చెఫ్‌లు, సర్వర్‌లను కూడా పరీక్షిస్తున్నామని, కరోనా ప్రోటోకాల్ ప్రకారం వారందరూ ఐసోలేషన్‌లో ఉన్నట్టు రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు వెల్లడించారు.

Ranas fiance miheeka

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!