HomeTelugu Trendingరానా 'విరాటపర్వం' ఫస్ట్‌లుక్‌

రానా ‘విరాటపర్వం’ ఫస్ట్‌లుక్‌

1 13
టాలీవుడ్‌లో ‘లీడర్‌’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి .. ఎన్నో విభిన్న పాత్రాల్లో నటించి, భల్లాలదేవుడిగా పేరు తెచ్చుకున్నారు దగ్గుబాటి రానా. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. శనివారం రానా పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం రానా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ‘రెవల్యూషన్‌ ఈజ్‌ యాన్‌ యాక్ట్‌ ఆఫ్‌ లవ్‌’ అని పోస్టర్‌పై రాసి ఉంది. ఇందులో రానా ముఖానికి ఓ ఎర్రటి క్లాత్‌ కట్టుకుని కనిపించారు. ఆయన లుక్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

‘విరాటపర్వం’ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్లపై సురేశ్‌ బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో రానాకు జంటగా సాయిపల్లవి నటిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి నక్సలైట్‌గా కనిపించనున్నారని సమాచారం. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu