చిరు సినిమాలో రానా..?

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చినప్పడు చాలా మంది హీరోలు ఆ సినిమాలో ఒక్క ఫ్రేమ్ లో కనిపిస్తే చాలని తహతహలాడారు. అయితే ఇప్పుడు చిరు వరుస చిత్రాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో కొందరి హీరోలకు అతడితో కలిసి నటించే అవకాశం లభిస్తోంది. ఆ లిస్ట్ లో ముందున్న పేరు రానా. అవును.. మీరు వింటున్నది నిజమే..
చిరు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సినిమాగా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర రానాను సంప్రదించినట్లు తెలుస్తోంది. చిరంజీవి మీద ఉన్న అభిమానం, చరణ్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా రానా ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ సినిమా ఆగస్ట్ లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.