వివాదంలో ఇరుక్కున ప్రియాంకా!

ప్రియాంకా చోప్రా ఇటు బాలీవుడ్ లో అటు హాలీవుడ్ లో తన సత్తా చాటుతూ.. నిర్మాతగా
కూడా బిజీగా మారుతుంది. అయితే ఇటీవల ఆమె కొందే నాస్ట్ అనే మ్యాగజీన్ కవర్ పేజ్
కోసం ఫోటోషూట్ లో పాల్గొంది. ఇప్పుడు కవర్ పేజ్ పై ప్రచురితమైన ఆ ఫోటో కారణంగా
ప్రియాంకా చోప్రా విమర్శలకు గురవుతోంది. ఈ ఫోటోలో ప్రియాంకా రెఫ్యూజీ, ఇమ్మిగ్రంట్,
అవుట్ సైడర్, ట్రావెలర్ అనే పదాలున్న టీ షార్ట్ ను ధరించింది. అయితే మొదటి మూడు
పదాలను కొట్టేసి కేవలం ట్రావెలర్ అనే పదాన్ని మాత్రమే ఆ టీషర్ట్ పై ఉండేలా చూసుకున్నారు.
దీన్ని బట్టి ప్రియాంకా తాను పర్యాటకురాలేనని చెబుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమె
మిగిలిన వారిని కించపరుస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఆ మ్యాగజీన్
ప్రమోషన్స్ కోసమే చేసినప్పటికీ తను ఒకవర్గం వారినే సపోర్ట్ చేస్తున్నట్లు నెటిజన్స్ ఆమెపై
మండిపడుతున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates