HomeTelugu Big Storiesవివాహా బంధంతో ఒక్కటైన బాలీవుడ్‌ ప్రేమజంట

వివాహా బంధంతో ఒక్కటైన బాలీవుడ్‌ ప్రేమజంట

Ranbir kapoor alia bhatt ar

బాలీవుడ్ ప్రేమ జంట రణబీర్- అలియా వివాహా బంధంతో ఒక్కటైయ్యారు. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రణబీర్ కపూర్- అలియా భట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వీరి పెళ్లిలో బాలీవుడ్ మొత్తం మెరిసింది. పెళ్లి కార్యక్రమాల నుంచి పెళ్లి వరకు తమ ఫోటో ఒక్కటి కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడిన ఈ జంట పెళ్లి తరువాత అఫీషియల్ గా తమ సోషల్ మీడియా అకౌంట్ లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. పెళ్లి దుస్తుల్లో ఈ జంట ఎంతో అందంగా కనిపిస్తున్నారు.

డిజైనర్ చీర లో అలియా.. డిజైనర్ షేర్వాణీ లో రణబీర్ మెరిసిపోతున్నాడు. ఇక పెళ్లి తరువాత అలియా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘ఐదు ఏళ్ల రిలేషన్ షిప్ అనంతరం ఏప్రిల్ 14న బంధువులు, స్నేహితుల సమక్షంలో మేం పెళ్లి చేసుకున్నాం. జంటగా మరెన్నో అనుభూతులను పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాం. ఈరోజు మాకెంతో ప్రత్యేకం’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక పొతే ఏప్రిల్ 16 న ఈ జంట రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ కి బాలీవుడ్ తో టాలీవుడ్ ప్రముఖులు కూడా కదిలిరానున్నారు. ఇక పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!