ఎన్టీఆర్ అప్పటికైనా జాయిన్ అవుతాడా..?

ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను సైతం పూర్తి చేసుకుంది. కానీ ఆ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. ఈ సోమవారం నుండి అయినా.. ఆయన షూటింగ్ లో పాల్గొంటారని అనుకున్నారు. కానీ అది కూడా అనుమానమే. ఎందుకంటే సడెన్ గా ఎన్టీఆర్ దుబాయి ప్రయాణాన్ని పెట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆయన మూడు విభిన్నమైన లుక్స్ లో కనిపించబోతున్నారు.

దానికోసమే దుబాయి వెళ్లారనేది తాజా సమాచారం. ఆయన దుబాయి నుండి తిరిగి వచ్చిన తరువాత కొన్ని కీలకమైన సన్నివేశాలను ఎన్టీఆర్ పై చిత్రీకరించనున్నారు. బహుశా మరో నాలుగు రోజుల్లో ఎన్టీఆర్ తిరిగిరావొచ్చని అంటున్నారు. కల్యాణ్ రామ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ‘జై లవకుశ’ అనే పేరు వినిపిస్తోంది. ఈ సినిమా ఒక హీరోయిన్ గా రాశిఖన్నాను ఎంపిక చేసుకున్నారు.