HomeTelugu Trendingరణ్‌బీర్ కపూర్ యానిమల్ మూవీ ప్రి టీజర్

రణ్‌బీర్ కపూర్ యానిమల్ మూవీ ప్రి టీజర్

Ranbir Kapoor Animal pre te
తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. తర్వాత అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్‌ హీరోగా ‘యానిమల్’ మూవీని యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇటీవల రిలీజైన ఫస్ట్‌ లుక్ పోస్టర్ చాలా వైలెంట్‌గా ఉంది. చాలా మందిని నోరెళ్లబెట్టేలా చేసింది. లవర్ బాయ్ లాంటి రణ్‌బీర్ కపూర్ గుబురు గడ్డంతో, రక్తం నిండిన బట్టలు, గొడ్డలితో క్రూరంగా కనిపించాడు. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ‘ప్రీ టీజర్’ అంతకుమించి ఉంది.

50 సెకన్లు గల ‘ప్రీ టీజర్’లో పంచె కట్టుకుని, చేతిలో గొడ్డలి పట్టుకుని, మాస్కులు వేసుకున్న ఓ గుంపుపై విరుచుకుపడ్డాడు. ఒంటి చేత్తో ఊచకోత కోస్తాడు. హాలీవుడ్ యాక్షన్ సీన్‌ను తలపించేలా ఉంది. ఈ వీడియోలో వినిపించే పంజాబీ పాట కాస్త కొత్తగా అనిపించింది.

ఆగస్టు 11న ‘యానిమల్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ సరసన రష్మిక మందన నటిస్తోంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu