ఆకట్టుకుంటున్న ‘రంగ్‌దే’ ట్రైలర్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌- వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘రంగ్‌దే’. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా శుక్రవారం చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఆద్యంతం నవ్వులు పంచుతూ ఆకట్టుకునేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. పీవీడీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈనెల 26న ‘రంగ్‌దే’ విడుదల కానుంది.

CLICK HERE!! For the aha Latest Updates