HomeTelugu Trending'రంగ దే' మరో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నాం: నితిన్‌

‘రంగ దే’ మరో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నాం: నితిన్‌

rangde Another schedule of
టాలీవుడ్‌ యంగ్ హీరో నితిన్, హీరోయిన్‌ కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలె తిరిగి ప్రారంభమైంది.

లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తాజాగా మరో షెడ్యూల్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నితిన్ ట్విటర్ ద్వారా తెలియజేశాడు. ”రంగ్ దే’ కి సంబంధించి మరో షెడ్యూల్ షూటింగ్ సురక్షితంగా, ఉత్సాహంగా పూర్తయింద’ ని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మూవీ యూనిట్‌ ప్రకటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!