రాణి వశిష్టిదేవిగా శ్రియ!

హీరోయిన్ గా ఒకప్పుడు తన హవాను కొనసాగించిన శ్రియ ఇప్పుడు ఆ రేంజ్ లో
కాకపోయినా.. ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూ హిట్ కొడుతోంది. ఈ నేపధ్యంలో
ఆమె ప్రస్తుతం బాలకృష్ణ సరసన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాలో నటిస్తోంది. మొదట
ఈ సినిమాలో హీరోయిన్ గా చాలా మందిని సంప్రదించగా.. ఫైనల్ గా శ్రియను కన్ఫార్మ్
చేశారు. ఈరోజు ఆమె పుట్టినరోజు సంధర్భంగా సినిమాలో ఆమె లుక్ ను చిత్రబృందం
రివీల్ చేసింది. రాణి వశిష్టి దేవిగా ఆమె లుక్ అదిరింది. మరి ఈ చిత్రంతో అమ్మడు
ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్
చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates