పవన్ మావయ్యే విలన్!

అలనాటి నటుడు రావు గోపాలరావు తనయుడు రావు రమేష్ ఇండస్ట్రీలో నటుడిగా నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది. తెలుగు తెరపై తనదైన విలనిజాన్ని పండించి ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఒకపక్క నాయకానాయకిలకు తండ్రి పాత్రల్లో నటిస్తూనే.. మరో పక్క విలన్ గా కూడా నటిస్తూ తన సత్తా చాటుతున్నాడు. అలాంటి రావు రమేష్ ఇప్పుడు పవన్ నటిస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కు మావయ్య పాత్రలో నటించిన రావు రమేష్ ఇప్పుడు పవన్ కు విలన్ గా నటిస్తుండడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది కాబట్టి సినిమాలో రావు రమేష్ యాస కూడా అలానే ఉంటుందట. ఈ సినిమా ఆయన కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోతుందని చెబుతున్నారు. జనవరి 1న సినిమా టీజర్ ను విడుదల చేసి ఉగాది కానుకగా సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.