HomeTelugu Newsకోలీవుడ్‌ కు రాశిఖన్నా

కోలీవుడ్‌ కు రాశిఖన్నా

9 25
రాశిఖన్నా ఇప్పడు వరుస ఫ్లాప్‌లతో సతమతమౌతుంది. ఒకటో రెండో హిట్లు వచ్చిన అవి హీరోల ఖాతాలోకి వెళ్లిపోతున్నాయి. ఇటవల విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ‘వరల్డ్ ఫెమస్ లవర్’ సినిమాకూడా అమ్మడి ఆశలను నిలబెట్టలేక పోయింది. దాంతో రాశి ఇప్పుడు కోలీవుడ్ వైపు చూస్తుంది. తెలుగులో ప్రస్తుతానికి ఈ బ్యూటీ ఏ సినిమాలో కూడా నటించడం లేదట. ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్న అవి చివరకి కన్ఫామ్ కాకపోవచ్చునని తెలుస్తుంది.

తాజాగా బొద్దుగుమ్మకు తమిళంలో ‘అర్మణి’ మూడవ పార్ట్ లో నటించే అవకాశం వచ్చింది. హీరోయిన్ గా ఛాన్స్‌ తమిళంలోనే ఎక్కువ వస్తున్న నేపథ్యంలో పూర్తిగా అక్కడకు ఈ అమ్మడు షిప్ట్ అవుతుందేమో అంటున్నారు. అలాగే తమిళ్ లో వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా చెయ్యాలని భావిస్తోందట రాశి. ఆర్య హీరోగా నటిస్తున్న ‘అర్మణి’ మూడవ పార్ట్ లో రాశిఖన్నా హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu