‘ఉంగరాల రాంబాబు’ షూటింగ్ పూర్తి!

సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ కానుకగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. అతిత్వ‌ర‌లోనే టీజ‌ర్ ని విడుద‌ల చేసి, త్వ‌ర‌లో ఆడియో ని విడుద‌ల చేస్తారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ”మా దర్శకులు క్రాంతి మాధవ్ తెర‌కెక్కించిన రెండు చిత్రాలు హృదయాల‌కి హ‌త్తుకునేలా వుంటాయి. ఆయ‌న మార్క్ వుంటూనే, సునిల్ త‌ర‌హా కామెడి చేస్తూ ఓ చక్కని కమర్షియిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఉంగరాల రాంబాబు చిత్రం ద్వారా అందించబోతున్నారు. సునీల్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో త‌న క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉండనుంది. మా చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. న‌వ్వించ‌మే ద్యేయంగా అది కూడా అవుటాఫ్ కామెడి కాకుండా క‌థ‌లోని కామెడి ని పోందు ప‌ర‌చి న‌వ్వించారు. అతి త్వ‌ర‌లో టీజ‌ర్, ఆడియోని విడుద‌ల చేస్తాము. ఫుల్ లెంగ్త్ కామెడి మాత్ర‌మే చేశాము. ఈ స‌మ్మ‌ర్ లో ఫుల్ కామెడి చిత్రం గా ఉంగరాల రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం” అని అన్నారు.