రాజమహేంద్రవరంలో రాశీఖన్నా సందడి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సినీనటి రాశీఖన్నా సందడి చేశారు. జేఎన్‌ రోడ్డులో ఓ మొబైల్‌ కొత్త షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆమెను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. మొబైల్‌ దుకాణం ప్రారంభించిన అనంతరం రాశీఖన్నా మాట్లాడుతూ.. తాను విజయ్‌ దేవరకొండతో పాటు తమిళంలో కూడా పలు చిత్రాలు చేస్తున్నట్టు తెలిపారు.