HomeTelugu Big Storiesవిజయ్‌తో బ్రేకప్‌ ఆ తెలుగు హీరో ప్రేమలో రష్మిక!

విజయ్‌తో బ్రేకప్‌ ఆ తెలుగు హీరో ప్రేమలో రష్మిక!

Rashmika dating with bellam

టాలీవుడ్‌లో రష్మిక మందన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప సినిమాతో ఈ అమ్మడుకి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ప్రస్తుతం పుష్ప-2లో నటిస్తుంది. అయితే ఇప్పటి వరకు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఈ బ్యూటీ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలసిందే. వీరిద్దరూ కలిసి `గీత గోవిందం` సినిమా చేశారు. ఆ సినిమా సమయంలోనే ఈ ఇద్దరి మధ్య జోడి కుదిరిందని, ప్రేమలో పడ్డారని, డేటింగ్‌ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి.

ఆ తరువాత నటించిన `డియర్‌ కామ్రేడ్‌`తో ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అంతేకాదు ఈ ఇద్దరు కలిసి వెకేషన్లకి వెళ్లడం, విజయ్‌ ఇంటికి రష్మిక రావడంతో ఆ వార్తలను నిజమే అనుకున్నారు. అయితే ఈ ఇద్దరు విడిపోయినట్టు ఈ మధ్య వార్తలొచ్చాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర రూమర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రష్మిక మందన్నా మరో తెలుగు హీరోతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేమలో పడిందని టాక్‌. ఆయన, రష్మిక కలిసి ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

Rashmika 1

కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అక్కడ చాలాక్లోజ్‌గా మూవ్‌ అయ్యారు. అప్పుడే ఈ గాసిప్స్‌ స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు ఈ ఇద్దరు కలిసి ఎయిర్‌ పోర్ట్ లోనూ సందడి చేశారు. కలిసి వెళ్తున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ముంబాయిలో జరిగిన ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌లో ఈ ఇద్దరు కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులో రష్మిక డ్రెస్‌ మరీ చిన్నది కావడంతో దాన్ని క్యారీ చేయడంలో ఇబ్బంది పడింది.

అయితే ఈఇద్దరు కలిసి సినిమా చేయలేదు. కలిసి సందర్భం కూడా చాలా అరుదు. మొదటిసారి కలిసి మీడియాకి చిక్కారు. మరి దానితోనే ఈ రూమర్స్ స్ప్రెడ్‌ అయ్యాయా? లేక నిజంగానే ఈ ఇద్దరి మధ్య లవ్‌ స్టార్ట్ అయ్యిందా? అనేది ఆసక్తికరంగా, హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది ఎంత వరకు నిజామో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `ఛత్రపతి` సినిమాలో నటిస్తున్నాడు. ఇది మే 12న విడుదల కానుంది. మరోవైపు రష్మిక మందన్నా హిందీలో `యానిమల్‌` చిత్రంలో నటిస్తుంది.

Rashmika 2

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu