అఖిల్‌కి కూడా ఆమేనా!

అక్కినేని అఖిల్ తన కొత్త చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా రెగ్యులర్ షూట్ మొదలైనా హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. మొదట్లో పలువురి పేర్లు వినబడినా ఎవరూ కన్ఫ్‌ర్మ్‌ కాలేదు. యంగ్‌ హీరోయిన్లు చాలామంది వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో వారి డేట్స్ దొరకలేదు.

దీంతో నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ గతంలో తమ ‘గీత గోవిందం’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట . ప్రస్తుతం ఆమె కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ పనుల్లో బిజీగా ఉండటంతో ఇంకొన్ని రోజుల తరవాత ఆమె షూటింగ్లో జాయిన్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే నిర్మాతలు నుండి అధికార ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే