వైరల్ అవుతున్న రష్మిక మందన్నవీడియో


చలో మూవీతో తెరంగేట్రం చేసిన రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరు. సమంతా అక్కినేని వలె, రష్మిక మందన్న కూడా ఫ్యాషన్, ఫిట్‌నెస్ విషయంలో ముందుంటారు. ఇద్దరూ తరచూ వారి ఫిట్‌నెస్ చిత్రాలను అభిమానులతో పంచుకుంటారు. వీరి వర్కౌట్ వీడియోలు అభిమానులను పిచ్చివాళ్లను చేస్తుంటాయి. ఇటీవల, రష్మిక తన బ్యాక్‌ఫ్లిప్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలలో ఆమె చేసిన చక్కని నటన దక్షిణాదిలో తనకంటూ ఓ పేరు తెచ్చుకోవడానికి సహాయపడిందని చెప్పాలి. మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకేవ్వరులో రష్మిక మందన్న నటిస్తోంది. భీష్మాలో నితిన్‌తోనూ రష్మిక నటించబోతుంది. నితిన్ హీరోగా వెంకి కుడుములా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీష్మ సినిమా 2020 ఫిబ్రవరి 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.