HomeTelugu Trendingమ‌ళ్లీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ వాయిదా

మ‌ళ్లీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ వాయిదా

Post Production delays force makers to postpone Ramarao on Duty

రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. ఇందులో రజీషా, దివ్యాంశ హీరోయిన్లు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించనున్న ఈ మూవీతో వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్నాడు. నాజర్‌, తనికెళ్ల భరణి, పవిత్రాల ఓకేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్‌ 17న విడుదలవుతున్నట్లు గతంలో ప్రకటించారు.

మ‌రో మూడు నాలుగు వారాల్లో రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుద‌ల అని అంద‌రూ అనుకుంటున్న త‌రుణంలో ఫ్యాన్స్ స‌హా అంద‌రికీ మేక‌ర్స్ షాకిచ్చారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను మ‌ళ్లీ వాయిదా వేస్తున్న‌ట్లు అనౌన్స్ చేశారు. త్వ‌ర‌లోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని చెప్పారు. అస‌లు ఎందుకు సినిమాను వాయిదా వేశామ‌నే విష‌యంపై చిత్ర యూనిట్ వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu