రవితేజ ‘క్రాక్‌’

మాస్‌ మహారాజ్‌ రవితేజ నటిస్తున్న కొత్త చిత్రానికి ‘క్రాక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమా టైటిల్‌ పోస్టర్‌తోపాటు, రవితేజ లుక్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో రవితేజ యాంగ్రీ పోలీస్‌ లుక్‌లో కనిపించారు. వాస్తవిక ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజకు జంటగా శ్రుతి హాసన్‌ కనిపించనున్నారు. తమిళ నటుడు సముద్రఖని ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించనున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం రవితేజ ‘డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జంటగా పాయల్‌రాజ్‌పుత్‌, నభా నటేష్‌ కనిపించనున్నారు. వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates