HomeTelugu Trending'కార్తికేయ2'లో మరో హీరోయిన్‌!

‘కార్తికేయ2’లో మరో హీరోయిన్‌!

4 11
యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘కార్తికేయ’. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు… నిఖిల్ కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పడు ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. అయితే కార్తికేయ సినిమా లో కలర్స్ స్వాతి నిఖిల్ కు జోడిగా కనిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కలర్స్ స్వాతికి పెళ్లి జరిగిన తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే ఈ నేపథ్యంలో కార్తికేయ2 సినిమాలో కలర్స్ స్వాతి కనిపిస్తుందా లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ విషయం పై హీరో నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. కార్తికేయ సినిమాలో కలర్స్ స్వాతి పాత్ర కొనసాగింపు ఉంది అని తెలిపాడు. అదే పాత్ర లో కలర్స్ స్వాతి నటిస్తూందని అని నిఖిల్ స్పష్టం చేశారు. స్వాతి తో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండబోతుందని కూడా తెలిపాడు. ఇక ఈ సినిమాను దసరాకు విడుదల చెయ్యాలని భావిస్తున్నారు చిత్రనిర్మాతలు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu