రవిబాబుతో విజయ్ దేవరకొండ!

పెళ్ళిచూపులు చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన నటుడు విజయ్ దేవరకొండ.
అంతకముందు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు. ఇప్పుడు
విజయ్ కు వరుస ఆఫర్స్ చుట్టుముడుతున్నాయి. అందులో భాగంగా వైజయంతీ మూవీస్
బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు ఈ యువ హీరో. ఈ చిత్రానికి డైరెక్టర్ గా
రవి బాబు పని చేయనున్నాడని తెలుస్తోంది. వచ్చే నెలాఖరున ఈ చిత్రాన్ని సెట్స్ పైకి
తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రవిబాబు ‘అదుగో’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
ఈ సినిమాలో పంది పిల్ల ప్రధాన పాత్రలో నటించనుంది. ఈ సినిమా ఫిబ్రవరి నెలలో విడుదల
కానుంది. ఈ సినిమా ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నింటిలో వైవిధ్యభరితమైన
చిత్రంగా నిలిచిపోతుందని ఆయన భావిస్తున్నారు.