HomeTelugu Newsఈ సినిమాలో కూడా పాయల్ అంతే బోల్డ్‌గా ఉంటుంది

ఈ సినిమాలో కూడా పాయల్ అంతే బోల్డ్‌గా ఉంటుంది

14 1టాలీవుడ్‌ లో పాయల్ రాజ్ పుత్ ..ఆర్ఎక్స్ 100 సినిమా ఎలాంటి హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మౌత్ వాయిస్ తోనే సినిమా మంచి హిట్ కొట్టింది. బోల్డ్ గా కనిపించే ఈ సినిమా యూత్ కు బాగా నచ్చింది. ఇందులో పాయల్ నెగెటివ్ టచ్ లో ఉండే పాత్రలో కనిపించింది. బోల్డ్ సన్నివేశాలు ఎలా ఉన్నప్పటికీ కేసుల అందులో ఆమె ఒదిగిపోయి నటించిన తీరు మెప్పించింది.

ఆ సినిమా హిట్ తరువాత హీరోయిన్ గా విడుదల కాబోతున్న రెండో సినిమా ఆర్డిఎక్స్ లవ్. ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో కూడా బోల్డ్, లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నప్పటికీ.. లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడంతో దానికి తగిన స్టోరీ కూడా ఉందని, తప్పకుండా అన్ని వర్గాలకు నచ్చుతుందని అంటున్నారు. అక్టోబర్ 11 వ తేదీన సినిమా విడుదల కాబోతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu