బర్త్ డే కోసమే లేట్ చేస్తున్నాడా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు మొదలు కాలేదు. మార్చి 20 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని చెప్పారు కానీ అలా జరగలేదూ. ఏప్రిల్ వస్తే కానీ సినిమా షూటింగ్ మొదలు పెట్టరని సమాచారం. అంటే దాదాపు అనుకున్న షెడ్యూల్ కంటే నెల రోజు ఆలస్యం చేస్తున్నారన్న
మాట.

దానికి కారణం ఈ నెల మార్చి 27న చరణ్ పుట్టినరోజు ఉంది. అందుకే ఆ పుట్టినరోజు వేడుకలు పూర్తి చేసుకొని షూటింగ్ లో పాల్గొనాలనుకుంటున్నాడు. హీరోగా, నిర్మాతగా రెండు సక్సెస్ లను అందుకున్న చెర్రీ ఈసారి తన పుట్టినరోజుకి భార్య ఉపాసనతో కలిసి ఫారెన్ లో సెలెబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ తరువాత నిర్విరామంగా షూటింగ్ నిర్వహిస్తారని
తెలుస్తోంది.