HomeTelugu Trending'శాకినీ-ఢాకినీ'గా రెజీనా, నివేదా థామస్‌!

‘శాకినీ-ఢాకినీ’గా రెజీనా, నివేదా థామస్‌!

Regina and nivetha thomas n

కొరియన్‌ చిత్రం ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ ఆధారంగా తెలుగులో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. తాజాగా ఈ చిత్రానికి ‘శాకినీ- ఢాకినీ’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేసిన్నట్లు సినీ వర్గాల సమాచారం. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో దగ్గుబాటి సురేశ్‌ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇద్దరు హీరోయిన్‌ల పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu