హీరోయిన్‌ కొత్త అవతారం.. ఎవరో గుర్తుపట్టారా?


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రెజీనా. మెగా హీరోలతో వరసగా సినిమాలు చేసిన రెజీనా ఒక సమయంలో మెగా హీరోయిన్ అనిపించుకుంది. రవితేజతో ఇటీవలే ఓ సినిమా కూడా చేసింది. అటు మెగాస్టార్ తో కూడా స్టెప్పులు వేసిన ఈ స్టార్ హీరోయిన్ లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యింది.

లాక్‌డౌన్ సమయంలో కొత్తగా ఆలోచించిన ఈ బ్యూటీ .. న్యూ మేకోవర్ ట్రై చేసిందేమో… తనను తాను పూర్తిగా మార్చేసుకుంది. ఈ మేకప్‌ చూస్తుంటే.. అసలు ఈమె రెజీనానా కాదా అనే విధంగా మారిపోయింది. దినికి సంబంధించిన ఫోటోలను ఈ అమ్మడు తన సోషల్ మీడియా ఖాతల్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.