HomeTelugu Big Storiesమహేష్‌బాబు మూవీలో రేణుదేశాయ్

మహేష్‌బాబు మూవీలో రేణుదేశాయ్

Mahesh with Renu Desai
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న తాజాచిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ ​దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ పక్కన కీర్తి సురేష్‌ తొలిసారి నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. ఇప్పటికే మహేష్‌ అభిమానులు ట్విటర్‌లో సర్కారు వారి పాట అనే హ‍్యష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌కు వదినగా పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్ర బృందం ఇప్పటికే రేణు దేశాయ్‌ని సంప్రదించినట్లు చెప్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu