HomeTelugu Big Storiesవరుణ్‌ తేజ్‌ 'గని' ఫస్ట్‌లుక్‌

వరుణ్‌ తేజ్‌ ‘గని’ ఫస్ట్‌లుక్‌

varun tej Ghani frist loo

మెగా ప్రీన్స్‌ వ‌రుణ్ తేజ్ ప్రస్తుతం ఎఫ్3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వరుణ్ తేజ్ బాక్సింగ్ నేప‌థ్యంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ బాక్సర్‌గా సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వరుణ్ కెరీర్‌లో 10వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీని అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ ఫిలింస్‌, బ్లూ వాటర్‌ క్రియేటివ్‌ బ్యానర్స్‌పై అల్లు వెంకటేశ్‌‌, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. ఈ రోజు వ‌రుణ్ తేజ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ కూడా విడుదల చేశారు. ఇందులో వ‌రుణ్ లుక్ మూవీపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఈ సినిమాకి ‘గ‌ని’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఈ మూవీ కోసం వరుణ్‌తేజ్‌ ప్రత్యేకంగా అమెరికాలో శిక్షణ పొందారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu