రివ్యూ: అభినేత్రి

నటీనటులు: ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్‌, సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వీ, షకలక శంకర్‌ తదితరులు..
సంగీతం: సాజిద్-వాజిద్, విశాల్
సినిమాటోగ్రఫీ: మనీష్‌ నందన్‌
ఎడిటింగ్‌: ఆంటోనీ
సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్‌
నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ
కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్‌.
తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌
దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘అభినేత్రి’. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో
ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల
ముందుకు వచ్చింది. మరి ‘అభినేత్రి’గా తమన్నా ఏరేంజ్ లో ఆకట్టుకుందో.. సమీక్షలోకి వెళ్ళి
తెలుసుకుందాం!
కథ:
కృష్ణ(ప్రభుదేవా) ముంబైలో సాఫ్ట్ వేర్ కంపనీలో పనిచేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా.. మోడర్న్
అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేది తన కల. అయితే సడెన్ గా తన బామ్మకు సీరియస్ గా
ఉందని తెలిసి ఊరికి బయలుదేరతాడు. ఇంట్లో ఎప్పటినుండో తన పెళ్లి విషయమై కృష్ణను ప్రెజర్
పెడుతుంటారు. చివరగా దేవి(తమన్నా) అనే అమ్మాయిని కృష్ణకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇష్టం
లేని పెళ్లి చేయడంతో దేవికి దూరంగా ఉంటాడు కృష్ణ. తన స్నేహితులకు కూడా దేవిని పరిచయం
చేయడం ఇష్టంలేక దూరంగా ఓ ఇంట్లో ఉంచుతాడు. ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి దేవి వింతగా
ప్రవర్తించడం గమనిస్తాడు. అసలు దేవి అలా ప్రవర్తించడానికి గల కారణాలేంటి..?ఆ ఇంట్లో
కృష్ణ, దేవిలు కాకుండా మరెవరైనా ఉన్నారా..? రూబి అనే అమ్మాయికి దేవికి ఉన్న సంబంధం
ఏంటి..? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
ప్లస్ పాయింట్స్:
ప్రభుదేవా, తమన్నా
ఫోటోగ్రఫీ
మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
కథనం
ఎడిటింగ్
విశ్లేషణ:
హీరోయిన్ అవుదామని ముంబైకి వచ్చిన అమ్మాయి అవకాశాలు చేజారి పోవడంతో ఆత్మహత్య
చేసుకొని చనిపోతుంది. ఆ ఇంట్లోకి కొత్తగా పెళ్ళైన జంట రావడం, ఆ అమ్మాయి శరీరంలోకి
ఆత్మ ప్రవేశించడం వినడానికి పాత కథ అయినా.. ట్రీట్మెంట్ మాత్రం కొత్తగా ఉంటుంది. అయితే
ఫస్ట్ హాఫ్ లో ఉండేంత క్రేజ్ సెకండ్ హాఫ్ లో సృష్టించలేకపోయారు. అనవసరపు సన్నివేశాలతో
నిడివి పెంచేశారు. సినిమా బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉన్నా.. అక్కడక్కడా బోర్ కొట్టించారు. కథనంలో
ఆశించినంత కొత్తదనం కనిపించలేదు. అయితే సినిమాకు పెద్ద ప్లస్ ప్రభుదేవా, తమన్నాల
నటన. తమన్నా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో అధ్బుతంగా నటించింది. ఒక పాటలో
తన డాన్స్ చూసి ప్రేక్షకులు మెస్మరైజ్ అయిపోతారు. ప్రభుదేవా స్క్రీన్ మీద కనిపించి చాలా
కాలం అయినప్పటికీ తన పెర్ఫార్మన్స్ రేంజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ తన డాన్సులతో
ఆకట్టుకుంటున్నాడు. సోనూ సూద్ సినిమాలో కూడా హీరో పాత్రలోనే కనిపించారు. సప్తగిరి
కామెడీ ఆకట్టుకుంటుంది. సినిమా ఎక్కువగా ఈ పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
ఫోటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సివుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
సెకండ్ హాఫ్ లో తమన్నా, ప్రభుదేవాల మధ్య వచ్చే సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. హారర్
సినిమా అయినప్పటికీ సినిమాలో దయ్యాన్ని చూపించకుండా.. ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యే
రీతిలో కథను నడిపించారు. మొత్తానికి అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే చక్కటి చిత్రం
ఈ అభినేత్రి.
రేటింగ్: 2.75/5

CLICK HERE!! For the aha Latest Updates