HomeTelugu Trendingఅప్స‌రతో‌ వర్మ 'థ్రిలర్'

అప్స‌రతో‌ వర్మ ‘థ్రిలర్’

2 5

క‌రోనా నేప‌థ్యంలో రామ్‌గోపాల్ వ‌ర్మ వ‌రుస సినిమాల్ని వ‌దులుతున్నాడు. ఇటీవలే పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్‌’ చిత్రాన్ని చేసిన వ‌ర్మ తాజాగా ‘నేక్డ్‌'( న‌గ్నం) సినిమాతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా మిర్యాల‌గూడ ప‌రువు హ‌త్య నేప‌థ్యంలో ‘మ‌ర్డ‌ర్’, హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ’12 ఓ క్లాక్‌’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న వ‌ర్మ త్వ‌ర‌లో మ‌రో చిత్రానికి కూడా శ్రీ‌కారం చుడుతున్నాడు. స్వీటీతో ‘నెక్డ్’ చిత్రాన్ని రూపందించి సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ రచ్చ చేసిన వ‌ర్మ తాజాగా ‘థ్రిల్ల‌ర్’ పేరుతో ఓ సినిమాని నిర్మిస్తూ ఈ చిత్రం ద్వారా హాట్ ఆట‌మ్ బాంబ్‌ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఈ విష‌యాన్ని వ‌ర్మ స్వ‌యంగా వెల్ల‌డించారు.

‘థ్రిల్ల‌ర్’ సినిమా కోసం అప్స‌ర రాణిని ప‌రిచ‌యం చేస్తున్నాను. ఒడిశాలో పుట్టి, డెహ్ర‌డూన్‌లో పెరిగి ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఉంటోంది. ఆమె మంచి న‌టి క‌న్నా అద్బుత‌మైన డ్యాన్స‌ర్. అప్స‌ర‌ని క‌ల‌వ‌డానికి ముందు త‌న‌కు ఒడిశా గురించి ఏమీ తెలియ‌ద‌ని.. అయితే అప్స‌ర‌ని క‌లిసిన త‌రువాత ఒడిశా అన్ని ర‌కాల హ‌రికేన్‌లని సృష్టించింద‌ని తెలుసుకున్నాన‌ని, ఒడిశాలో ఇంత అందం దాగి వుంద‌ని ఇప్పుడే తెలుసుకున్నాన‌ని, ఇది ఒడిశాకు మ‌రింత బ‌లం అని అప్స‌ర ఫొటోల‌ని వ‌ర్మ ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu