రూ.100 కోట్ల క్లబ్‌లోకి కబీర్‌సింగ్ సినిమా..!


దేశమంతటా 3,123 స్క్రీన్లలో విడుదలైన కబీర్‌ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం సింగిల్ స్క్రీన్లతో పాటు మల్టీప్లెక్స్లలో సునామీలా దూసుకుపోతుంది. అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రీమేక్‌గా వచ్చిన కబీర్ సింగ్, ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద నాల్గవ అతిపెద్ద హిందీ ఓపెనర్‌గా నిలిచింది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన ఓపెనింగ్‌తో తొలి వారం రూ .70 కోట్ల కలెక్షన్‌ సాధించటమే కాకుండా మొదటి
5 రోజుల్లోనే రూ.100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. కబీర్ సింగ్ సినిమా మొత్తం కలెక్షన్‌ మంగళవారం నాటికి 104.90 కోట్లకు చేరుకుంది. కబీర్ సింగ్ సినిమా భారీ విజయం సాధించడంతో షాహిద్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కియారా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఉన్న ఫోటోను పోస్ట్‌ చేశాడు.