HomeTelugu Newsఅతణ్ణి పట్టిస్తే లక్ష ఇస్తా: వర్మ

అతణ్ణి పట్టిస్తే లక్ష ఇస్తా: వర్మ

4 11కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో ట్రోల్‌ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలికలతో ఉన్న వ్యక్తి ఓ హోటల్‌లో సర్వ్‌ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇప్పటికే విపరీతంగా వైరల్‌ అయిన ఈ వీడియో క్లిప్‌పై సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించాడు.

‘ఈ వ్యక్తిని వెతికి పట్టుకోవటంలో ఎవరైనా నాకుసాయం చేస్తారా.? అతణ్ణి నాకు టచ్‌లోకి తీసుకువచ్చిన వారికి లక్ష రూపాయల రివార్డ్ అందిస్తా.’అంటూ వర్మ ఆ వీడియోను తన ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్ చేశాడు. చాలా రోజుల క్రితం వర్మ ప్రకటించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను అక్టోబర్‌19 నుంచి ప్రారంభించనున్నాడు. ఎన్టీఆర్‌ జీవితంలోని కీలక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరిలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu