HomeTelugu Trendingఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌-2 కంటే కార్తికేయ-2 బిగ్గెస్ట్‌ బ్లాక్బస్టర్‌: రామ్‌ గోపాల్‌ వర్మ

ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌-2 కంటే కార్తికేయ-2 బిగ్గెస్ట్‌ బ్లాక్బస్టర్‌: రామ్‌ గోపాల్‌ వర్మ

Rgv tweet on krthikeya 2

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్ సిద్దార్థ నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ2’. హిందీలో అనూహ్యంగా దూసుకెళ్తున్న ఈ చిత్రం పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2ని మించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని కొనియాడారు. నిఖిల్ ‘కార్తికేయ2’.. విడుదలైన రెండో శుక్రవారం ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ కంటే డబుల్ కలెక్షన్స్ ను రాబట్టింది. రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్2’కంటే ‘కార్తికేయ-2′ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్. దర్శకుడు చందు మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ కు నా అభినందనలు’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

ఇక, ‘కార్తికేయ2’ నిఖిల్ కెరీర్లో అతి పెద్ద విజయంగా నిలిచింది. తొలిసారి తెలుగుతో పాటు మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి అద్భుత స్పందన వస్తోంది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా దూసుకెళుతోంది. దాంతో వారం రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 60 కోట్ల వరకు వసూలు చేసింది. హిందీలో కేవలం 50 స్ర్కీన్లలో విడుదలైన ఈ చిత్రం వారం తిరిగే సరికి 3000 స్ర్కీన్లకు పెరిగింది. శ్రీ కృష్ణుడికి సంబంధించిన కథ కావడంతో హిందీ జనాలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో, రోజు రోజుకు ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!