HomeTelugu Trendingవ్యూహం: ట్రైలర్‌ విడుదల

వ్యూహం: ట్రైలర్‌ విడుదల

RGVs Vyooham Trailer 2

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఆధారంగా వస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘U’ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది.

ఈ నెలాఖరులో సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్జీవి వ్యూహం మూవీ సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. ఈ ట్రైలర్ మరోసారి హాట్ టాపిక్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ ట్రైలర్‌ లోని పవన్ చెప్పే డైలాగ్స్ ని బట్టి రాంగోపాల్ వర్మ ఇందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని నెగటివ్ గా చూపించే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతుంది.

ట్రైలర్లో పొలిటికల్ డైలాగ్స్ కూడా బాగానే పేలాయి. టైలర్ చివర్లో వైయస్ జగన్ పాత్రధారి..’ నా నిజాన్ని గుర్తించేలా చేస్తాను. ఇదే నా శపథం’ అంటూ చెప్పే డైలాగ్ చూస్తే సినిమా అంతా జగన్ కి ఆర్జీవి సపోర్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది. జగన్ని హైలెట్ చేస్తూ చివరికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని విలన్ గా చూపించినట్లు ఈ ట్రైలర్ ఉంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu