HomeTelugu Trendingనా దగ్గర ఉన్న సుశాంత్ ఆస్తులు ఇవే: రియా

నా దగ్గర ఉన్న సుశాంత్ ఆస్తులు ఇవే: రియా

Rhea shares sushants propeబాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా శుక్రవారం ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమారు 8 నుంచి తొమ్మిది గంటల పాటు అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. కాగా సుశాంత్‌ అకౌంట్‌ నుంచి రియా దాదాపు 15 కోట్ల రూపాయల మేర తన అకౌంట్‌కు బదిలీ చేయించుకుందని అతడి తండ్రి కేకే సింగ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రియాతో పాటు ఆమె కుటుంసభ్యుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. సుశాంత్ మృతిపై మొద‌టినుంచి ప‌లు అనుమానాలు రేకెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సీబీఐ విచార‌ణ చేప‌డుతుండ‌టంతో మ‌రింత ప్రాధాన్యం సంత‌రించుకుంది.

కాగా రియా చ‌క్ర‌వ‌ర్తి సుశాంత్‌కి సంబంధించిన ఆస్తి కేవ‌లం త‌ను రాసిన లెట‌ర్ మాత్ర‌మేన‌ని అన్నారు. ఇందులో సుశాంత్ రాసిన‌ట్లుగా ఉన్న ఓ లేఖ‌ను ఆమె విడుద‌ల చేశారు. లేఖ‌లో ‘నా జీవితం ప‌ట్ల కృతజ్ఞుడిని.. లిల్లు (షోయుక్ చ‌క్ర‌వ‌ర్తి ), బెబు (రియా), స‌ర్ (రియా తండ్రి), మ్యాడ‌మ్ (రియా త‌ల్లి ), ఫ‌డ్జ్ (సుశాంత్ పెంపుడు కుక్క‌) నా జీవితంలో ఉన్నందుకు నేను కృతజ్ఞుడిని’ అని సుశాంత్ రాసిన లెట‌ర్‌ను ఈడీ ముందుంచారు. అయితే ఈ లెట‌ర్ నిజంగానే సుశాంత్ రాశాడా లేదా క‌ల్పిత‌మా అన్న‌ది తేలాల్సి ఉంది.

అంతేకాకుండా రియాకు ఈ లెట‌ర్ ఎక్క‌డినుంచి వ‌చ్చింద‌న్న‌ది కూడా స్ప‌ష్టం కాలేదు. ప్ర‌స్తుతం త‌న ద‌గ్గ‌ర సుశాంత్ రాసిన‌ట్లుగా ఉన్న ఈ లెట‌ర్, త‌ను వాడిన వాట‌ర్ బాటిల్ మాత్ర‌మే ఉన్నాయ‌ని, ఇవే సుశాంత్ నుంచి తీసుకున్న ఆస్తి అని రియా పేర్కొన్నారు. సుశాంత్ నుంచి తానెప్పుడూ డ‌బ్బు తీసుకోలేద‌ని తెలిపారు.

Rhea shares sushant

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!