
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం ‘తలైవా 170’. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ దుషారా విజయన్ కీలక పాత్రలో నటిస్తోంది. టీమ్‌లోకి ఆమెకు స్వాగతం పలుకుతున్నట్టు తెలియజేస్తూ ఇప్పటికే ఓ అప్‌డేట్ అందించారు మేకర్స్. దుషారా విజయన్ ఇందులో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టారు.
వెంకటేశ్ హీరోగా నటించిన ‘గురు’ హీరోయిన్ రితికా సింగ్ ఈ చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. రితికా సింగ్ ను టీంలోకి స్వాగతం పలుకుతూ లైకా ప్రొడక్షన్స్ టీం రిలీజ్ చేసిన తాజా అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తలైవా 170 2024లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, కోలీవుడ్ బ్యూటీ మంజువారియర్ కీ రోల్స్‌లో నటించబోతున్నారని వార్తలు వస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్‌లో లాల్‌సలామ్‌లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతి 2024 కానుకగా విడుదల కానుంది. రజినీకాంత్ మరోవైపు తలైవా 171కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.













