HomeTelugu Big Storiesఈవారం రోల్ రైడా అవుట్‌..ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే..!

ఈవారం రోల్ రైడా అవుట్‌..ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే..!

ఇక బిగ్ బాస్ సీజన్ 2 అంతిమ ఘట్టానికి చేరుకుంది. మరో వారం మాత్రమే మిగిలి ఉండటంతో గ్రాండ్ ఫినాలేకి వెళ్లేందుకు కంటెస్టెంట్స్ మధ్య హోరా హోరా పోరు నడుస్తోంది. అయితే ఇక ఇంటిలో కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. (సామ్రాట్, తనీష్, దీప్తి, కౌశల్, గీత, రోల్ రైడా) సామ్రాట్ గ్రాండ్ ఫినాలే తొలి కంటెస్టెంట్‌గా కర్ఛీఫ్ వేసేశాడు. ఇక మిగిలిన ఐదుగురులో నలుగురుకి మాత్రమే గ్రాండ్ ఫినాలేకి ఛాన్స్ ఉండటంతో ఈ నలుగురులో ఎవరు గ్రాండ్ ఫినాలేకి వెళ్తారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.

8a 4

కాగా తాజాగా లీకైన సమాచారాన్ని బట్టి ఈవారం బిగ్ బాస్ హౌస్‌ నుండి రోల్ రైడా ఎలిమినేట్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. నిజనికి రోల్ కి డైరెక్ట్‌గా గ్రాండ్ ఫినాలేకి వెళ్లే అద్భుత అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్. అయితే సామ్రాట్‌తో ఉన్న బాండింగ్ కారణంగా ‘మీ గుడ్డు జాగ్రత్త’ టాస్క్‌లో చివరి వరకూ పోరాడకుండానే మధ్యలోనే చేతులెత్తేశాడు రోల్. కౌశల్ పాత గొడవల్ని పక్కనపెట్టి హెల్ప్ చేస్తానన్నా.. సామ్రాట్ గెలుపునే కోరుకున్నాడు రోల్. సామ్రాట్‌ వైపు మొగ్గు చూపిన రోల్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. సీజన్ ప్రారంభం నుండి సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా ఒక్కొక్కరి దగ్గర ఒక్కో మాట చెబుతూ ఫైనల్ వరకూ వచ్చేశాడు. అయితే ఈ ఎలిమినేషన్స్‌లో రోల్ బిగ్ బాస్ హౌస్‌ను వీడటం ఖాయంగానే అన్నట్లుగానే అనిపిస్తుంది.

మిగిలిన కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ వివాదాస్పద కంటెస్టెంట్‌గా మారిన కౌశల్‌కి ప్రేక్షకుల నుండి సంపూర్ణ మద్దతు ఉండతంలో పాటు.. రేటింగ్, ఓటింగ్, నాని ‘దేవదాస్’ మూవీ రిలీజ్ తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని కౌశల్‌పై చివరి నామినేషన్స్ ప్రభావం లేకపోవచ్చు. ఇక గీతా మాధురి తొలి నుండి చాలా బ్యాలెన్డ్‌గా గేమ్ ఆడుతూ.. కౌశల్ తరువాతి స్థానాన్ని పదిలం చేసుకుంది. ఆమెకు మహిళా ప్రేక్షకుల మద్దతు ఎక్కువగానే ఉంది.

8 24

మరో కంటెస్టెంట్ తనీష్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం నుండి టాస్క్‌ల విషయంలోనూ, పెర్ఫామెన్స్ పరంగా చాలా పూర్ అయినప్పటికీ హౌస్ మేట్స్ అండతో ఎలిమినేషన్స్ నుండి ఎస్కేప్ అవుతూ చివరి వారం వరకూ దూసుకొచ్చేశాడు. దీనికి తోడుగా నాని మద్దతు కూడా తనీష్‌కే ఉందంటూ బయట జరుగుతున్న ప్రచారం నడుస్తోంది. తనీష్ ఫైనల్‌కి రావడంతో అది మరింత బలపడింది. అయితే.. చివరి నామినేషన్స్‌లో తనీష్‌ని తప్పించే సాహసాన్ని బిగ్ బాస్ చేయకపోవచ్చు.

ఇక మరో కంటెస్టెంట్ దీప్తి నల్లమోతు ఇప్పటికే చాలా సార్లు ఎలిమినేషన్స్ నుండి తప్పించుకుంది. ఎలాగోలా చివరి వారం వరకూ నెట్టుకొచ్చిన దీప్తికి ఈవారం ఎలిమినేషన్ ప్రాణసంకటంగా మారింది. కాగా ఈ నలుగురు కంటెస్టెంట్స్‌తో పోల్చుకుంటే దీప్తి వీక్ అనే చెప్పాలి. అయితే లీకైన ఓటింగ్ ప్రకారం దీప్తి.. కౌశల్ కంటే ఎక్కువ ఓట్లను పొందుకుందని తెలుస్తోంది. దీనికి ఆమె తరపున ఓ టెక్నికల్ టీం 24 గంటలు హార్డ్ వర్క్ చేస్తూ ఫేక్ ఓటింగ్‌కు పాల్పడుతుందంటూ కౌశల్ ఆర్మీ ఆరోపిస్తూ.. ఆధారాలను బయటపెట్టింది. ఇదే నిజమైతే దీప్తి నల్లమోతుకి ఫైనల్ కు వెళ్లడం ఖాయమే.

8b 2

ఇక ఆన్ లైన్‌లో లీకైన సమాచారాన్ని బట్టి ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారంటే.. మొదటి నుండి ఫేవరేట్ కంటెస్టెంట్‌గా ఉన్న కౌశల్ ఈ వారంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కౌశల్‌కి మిగిలిన కంటెస్టెంట్స్‌కి ఓట్ల శాతం సగానికి పైడా తేడా ఉండటం గమనార్హం. కుక్క కామెంట్స్‌తో ఇమేజ్‌కి డ్యామేజ్ కలగవచ్చునని కౌశల్ ఆర్మీ భావించినా.. ఆ ప్రభావం ఓటింగ్‌పై పడలేదు. ఇక కౌశల్ తరువాత స్థానంలో గీతా మాధురి కొనసాగుతోంది. ఇక అనూహ్యంగా చివరివారం ఓటింగ్‌లో పుంజుకుని మూడో స్థానంలో నిలిచింది దీప్తి నల్లమోతు. మొన్నటి వరకూ ఐదో స్థానంలో ఉన్న దీప్తి.. తనీష్, సామ్రాట్, రోల్ రైడాల కంటే మందు ఉంది.

సామ్రాట్, తనీష్, రోల్ రైడాలు ఆ తరువాత స్థానాల్లో నిలిచారు. అయితే రోల్ రైడాకి తనీష్‌కి ప్రేక్షకుల నుండి పోలైన ఓట్లలో పెద్దగా తేడాలేదు. స్వల్ప తేడాతో రోల్ రైడా బిగ్ బాస్ హౌస్‌ నుండి వీడుతున్నట్టు ఈ ఓటింగ్ లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పటి వరకూ పెద్దగా అనూహ్యమైన పరిణామాలు జరగలేదు. ఇది బిగ్‌బాస్‌ హౌస్‌ కావడంతో ఈ లెక్కలు తారుమారైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu