రజిని మాటను నిజం చేయబోతున్నాడు!

మోహన్ బాబు, రజినీకాంత్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ప్రతి సంధర్భంలోనూ వీరి మధ్య సానిహిత్యాన్ని తెలియజేస్తూనే ఉన్నారు. తాజాగా రజినీకాంత్ అల్లుడు ధనుష్ డైరెక్ట్ చేసిన ‘పవర్ పాండి’ సినిమా స్పెషల్ షోను రజినీకాంత్, మోహన్ బాబుతో కలిసి చూశారు. దర్శకుడిగా ఇది ధనుష్ కి తొలి సినిమా. ఈ సినిమా మొదటి షో నుండి పాజిటివ్ టాక్ ను
తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన రజిని, ధనుష్ ని ఎంతగానో అభినందించారట. దాంతో పాటు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయమని మోహన్ బాబుకి సూచించినట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో మోహన్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రజినీకాంత్ సూచన మేరకు మోహన్ బాబు ఈ సినిమాను రీమేక్ చేయడానికి రంగంలోకి దిగాడని తెలుస్తోంది. తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు కూడా మొదలుపెట్టారట. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు అనౌన్స్ చేయనున్నారు.