HomeTelugu Trending'ఆర్‌ఆర్‌ఆర్‌' విలన్‌ కన్నుమూత

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విలన్‌ కన్నుమూత

RRR actor ray stevenson pas

ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ప్రతిష్టత్మిక చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో విలన్‌గా దేశప్రజలకు సుపరిచితమైన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూశారు. ఆయన హఠాన్మరణానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. థోర్ సినిమా సీరిస్‌తో ఆయన ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయ్యారు. ఆయన మరణవార్తపై ఆర్ఆర్ఆర్ బృందం సంతాపం తెలిపింది.

ఈ వార్త తమను షాక్‌కు గురిచేసిందని ట్వీట్ చేసింది. రే స్టీవెన్సన్ ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపింది. స్టీవెన్సన్ మృతిపై ఆయన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సంతాపం తెలియజేశారు. స్టీవెన్సన్ నార్త్ ఐర్లాండ్‌లో 1964 మే 25న జన్మించారు. బ్రిటీష్ ఓల్డ్ వీక్ థియేటర్‌లో నటనలో శిక్షణ పొందారు. 1990ల్లో టీవీ షోలతో ఆయన తన వృత్తిజీవితాన్ని ప్రారంభించారు.

1998లో థియరీ ఆఫ్ ఫ్లైట్ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. థోర్ సిరీస్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. రే స్టీవెన్సన్ చివరిగా నటించిన ‘డిస్నీ అషోకా’ సిరీస్ త్వరలో విడుదల కానుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu