సమంతను మోసం చేశారట!

సమంతను తన సొంత అనుకున్న వాళ్ళే మోసం చేశారట. ఈ విషయం పట్ల ఆమె తెగ బాధపడిపోతుంది. అసలు విషయంలోకి వస్తే.. సమంత దగ్గర స్టాఫ్ గా మేకప్ మ్యాన్, అసిస్టెంట్ ఇలా నలుగురైదుగురు పని చేస్తున్నారు. సమంత వారిని బాగానే చూసుకుంటుంటుంది. జీతాలు కూడా పక్కాగా ఇచ్చేస్తూ ఉంటుంది.

అంతేకాదు వాళ్ళ ఇంట్లో విషయాలను కూడా అడిగి మరీ తెలుసుకుంటుంటుంది. అయితే రీసెంట్ గా సమంత డైమండ్ రింగ్ పోయిందట. ఆ రింగ్ ఎప్పుడు సమంత చేతికే ఉంటుందని.. అది సెంటిమెంట్ కూడా అని తెలుస్తోంది.

అటువంటి రింగ్ ను తన స్టాఫ్ లో ఎవరో దొంగిలించారట. వారిలో ఒకరే తీశారనేది సమంత గట్టి నమ్మకం. దీంతో వారిని చూడడం ఇష్టంలేని సమంతా ముంబై నుండి కొత్తవారిని పిలిపించి తన స్టాఫ్ గా నియమించుకుంది. నమ్మిన వ్యక్తులే అలా మోసం చేయడం సమంత తట్టుకోలేకపోతుందని సమాచారం.