బాలయ్య ‘రూలర్‌’ ట్రైలర్‌ రిలీజ్‌

నందమూరి బాలకృష్ణ.. కేఎస్‌ రవికుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘రూలర్‌’. ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌, సాంగ్‌కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ ట్రైలర్‌లో బాలయ్య మరింత ఆకట్టుకున్నారు. ‘ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే.. దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు.. పొగరు ఉంటుందో చూపించమంటవా’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌ హైలెట్‌గా నిలిచింది.

సి. కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన వేదిక, సోనాల్‌ చౌహాన్‌ నటిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు. భూమిక, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 20 ఈ చిత్రం విడుదల కానుంది.

CLICK HERE!! For the aha Latest Updates